మెగాస్టార్‌కి శుభాకాంక్షల వెల్లువ

33
- Advertisement -

తెలుగు వెండితెరకు చిరంజీవిగా పరిచయమైన శివశంకర వరప్రసాద్ అంచెలంచెలుగా ఎదిగి సుప్రీమ్ హీరో అయ్యారు, అనతి కాలంలోనే మెగాస్టార్ అయ్యారు. ఆగస్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు చిరంజీవి. ఆరు ప‌దుల వ‌య‌స్సులో కూడా ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న చిరు, మ‌రిన్ని మంచి సినిమాల‌తో మ‌న‌ల్ని అల‌రిస్తూ, ఇలాంటి పుట్టిన రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని మా ‘గ్రేట్ తెలంగాణ.కామ్’ మ‌న‌సారా కోరుకుంటుంది. కొందరు ప్రముఖులు కూడా మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఎవరు ఎలా విష్ చేశారో చూద్దాం రండి.

అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ.. మెగాస్టార్ చిరంజీవితో పాటు దిగిన చిన్ననాటి పోటోను పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

మిత్రుడు చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని బాలయ్య బాబు కూడా మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

Also Read:గుంటూరు కారం…అదిరే అప్‌డేట్

హీరోయిన్ కీర్తి సురేశ్ మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెగాస్టార్ ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారని, ఆయన ఎప్పుడూ బాగుండాలని మెగాస్టార్‌కు కీర్తి సురేశ్ బర్త్ డే విషెస్ చెప్పింది.

వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి చిరుకి స్పెషల్ గా బర్త్ డే విషెస్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిరంజీవి గారు మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని విజయ్ సాయి రెడ్డి ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషితో చిరంజీవి అంజెలంచెలుగా ఎదిగారని, సినీ పరిశ్రమ భవిష్యత్‌, సినీ కార్మికుల సంక్షేమాన్ని సదా కోరుకునే ఆయన.. నిండు నూరేళ్లు ఆరోగ్య, ఆనందాలతో వర్థిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Also Read:మెగా157 అనౌన్స్ మెంట్

- Advertisement -