- Advertisement -
పుట్టిన పిల్లలకు పేరు ఎంచుకునే సమయంలో పుట్టిన తేదీ, వారసత్వం, విలక్షణం, జోతిష్యం, తల్లిదండ్రుల పేరు మీదుగా పేరు పెడతారు. మరికొంతమంది ముందుచూపుతో ఆలోచించి విదేశాల్లో బాగా ప్రాముఖ్యం కలిగిన పేర్లను ఉపయోగిస్తారు. ఇంకొంత మంది పేర్లను చరిత్రలో నిలిచిన వ్యక్తుల పేరు పెట్టుకుంటారు.
సెలబ్రిటీలే కాదు ఇప్పుడు సామాన్యులు కూడా తమ బిడ్డకు పేరు పెట్టే ముందు చాలా పరిశోధనలు చేస్తుంటారు. పేరుకు అర్థం ఏమిటి, పేరు స్టైలిష్‌గా ఉందా లేదా, ఇది చాలా పాత ఫ్యాషన్‌గా ఉందా, ఇది పిల్లల వ్యక్తిత్వానికి సరిపోతుందా లేదా? కానీ మన బాలీవుడ్, ప్రముఖ క్రికెటర్‌ల పిల్లల పేర్లు పూర్తిగా దేశియ పదాలైన సంస్కృతంలోని పేర్లను పెట్టుకున్నారు.
- నితారా అక్షయ్‌కుమార్ మరియు ట్వింకిల్ ఖన్నా కుమార్తెకు చాలా ప్రత్యేకమైన పేరు ఉంది. దీనికి సంస్కృతంలో లోతైన మూలాలు ఉన్నాయని అర్థం.
- అదిరా బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ మరియు దర్శకుడు నిర్మాత ఆదిత్యా చోప్రా కుమార్తెకు అదిరా అనిపేరు పెట్టారు. దీనికి అర్థం సంస్కృతంలో శక్తిమంతుడైన ఇంద్రునికి చెందినది అని అర్థం.
- హృదయ్ సుసాన్ ఖాన్ మరియు హృతిక్‌రోషన్ హ్రేహాన్ మరియు హృదాన్ రోషన్ అనే ఇద్దరు కుమారులు ఆరాధ్య అనే కుమార్తె ఉన్నారు. చిన్న కొడుకు హృదాన్ పేరు సంస్కృతంలో మంచి స్వభావం గల వ్యక్తి అని హృదయ బహుమతి అని అర్థం వస్తుంది.
- మెహర్ నేహా ధూపియా అంగద్‌బేడీల మొదటి బిడ్డకు మెహర్ అని పేరు పెట్టారు. దీన్ని అర్థం పంజాబీలో గురుముఖి (అశీర్వాదం) అని ఆర్థం.
- ఆర్యవీర్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన పెద్ద కొడుకుకు ఆర్యవీర్ అని పేర పెట్టారు. సంస్కృతంలో ధైర్యవంతుడు మరియు నిర్భయుడు అని అర్థం.
- స్వస్తి మరోక క్రికెట్ లెజెండ్ తన కుమార్తెకు స్వస్తి అని పేరు పెట్టాడు. దీని అర్థం సంస్కృతంలో శ్రేయస్సు లేదా అదృష్ట ఆకర్షణ.
- నిధాయన క్రికెటర్ రవీంద్ర జడేజా రివాబా సోలంకిల కుమార్తెకు నిధాయన అనే పేరు పెట్టారు. సంస్కృతంలో నిధాయన అంటే చూడటం అని అర్థం. రివాబా సోలంకి జామ్‌నగర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచింది.
- వామిక క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మల గారాల పట్టికి వామిక అనే పేరు పెట్టారు. అంటే దుర్గాదేవి అని అర్థం.
- ఆరిన్ మాధురీ దీక్షిత్ శ్రీరామ్ ల చిన్న కుమారుడికి ఆరిన్ అనే పేరు పెట్టారు. ఇది బెంగాలీ మూలం పేరు మరియు పర్వతం లాంటి బలం కలిగినది అని అర్థం వచ్చేలా పేరు పెట్టుకున్నారు.
- ఆరాధ్య మాజీ ప్రపంచ సుందరి నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు నటుడు అభిషేక్ బచ్చన్ తమ కుమార్తెకు ‘ఆరాధ్య’ అని పేరు పెట్టారు. దీని అర్థం పూజించదగినది.
ఇవి కూడా చదవండి…
కొబ్బరి నీళ్ళు తాగుతున్నారా.. ఇవి తెలుసా!
వైరల్ : రాజమౌళి కి ప్రభాస్ కంగ్రాట్స్
రోలెక్స్ పై లోకేశ్ క్లారిటీ…
- Advertisement -