- Advertisement -
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండటం వల్లే కౌంటింగ్ ఆలస్యమైందన్నారు ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. కౌంటింగ్ ఆలస్యంపై స్పందించిన ఆయన..4వ , 5వ రౌండ్ కు 20 నిమిషాలు లేట్ అయ్యిందన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరి కాదు… ఇక్కడ ఫలితాలు కొద్దిగా లేట్ అవుతాయన్నారు.
సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించామని…అధికారులు, ఏజెంట్లు, మీడియా సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందన్నారు. ఫలితం కాపీని ఆర్వో దగ్గరికి వచ్చిన తర్వాతే సంతకం చేసి విడుదల చేస్తున్నారని తెలిపారు. ప్రతి రౌండ్ కు అరగంట పడుతుందన్నారు.
ఫలితాలు వెలువడటానికి మొత్తం సమయం 7.30 గంటల సమయం పడుతుందని చెప్పారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగలేదని…4 రౌండ్ మరో సారి లెక్కింపు పై అక్కడి అధికారులు నిర్ణయం తీసుకుంటారన్నారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -