పుర పోరు…సర్వం సిద్ధం

130
cec
- Advertisement -

గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలు, పలు పట్టణాల్లోని వార్డులకు శుక్రవారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు.

మొత్తం 1,539 పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్‌ జరుగుతుందని, 9,809 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఇందులో 676 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని వెల్లడించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు 872 పోలింగ్‌ స్టేషన్లలో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

ఎన్నికల సిబ్బందికి మొత్తం 28,810 ఫేస్‌ మాస్కులు, 14,505 ఫేస్‌ షీల్డులు, 22,910 గ్లౌజ్‌లు, 18,455 హ్యాండ్‌ శానిటైజర్లు, 4,895 శానిటైజర్‌ బాటిళ్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు రూ.3,65,750 నగదు సీజ్‌ చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. 37 ఫిర్యాదులు వచ్చాయని, 67 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసినట్టు బ్యాలెట్‌ బాక్సులన్నింటిని శానిటైజ్‌ చేశామని…పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లు ఒకరికొకరు ఆరు ఫీట్ల దూరంలో లైన్లలో నిలబడేలా సర్కిల్స్‌ గీసినట్టు వెల్లడించారు.

- Advertisement -