కాంగ్రెస్,బీజేపీలపై ఈసీ అసహనం

15
- Advertisement -

కాంగ్రెస్,బీజేపీ రెండు పార్టీలపై అసహనం వ్యక్తం చేసింది ఈసీ. ఈ రెండు పార్టీల అగ్రనేతలు మాట్లాడిన తీరు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు వస్తుందని ఈసీ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు పంపింది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని ఈసీ ఆదేశించింది.ఉన్నత స్థాయిల్లో ఉన్న వ్యక్తుల ప్రచార ప్రసంగాలు మరింత తీవ్రమైన పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉంటుందని ఈసీ తన నోటీసుల్లో పేర్కొంది.

రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అనుసరిస్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని ఈసీ సూచించింది. అది పార్టీ బాధ్యత అని తెలిపింది. ముఖ్యంగా స్టార్‌ క్యాంపెయినర్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read:పౌష్టికాహార లోపమా..అయితే జాగ్రత్త!

- Advertisement -