కన్నుల పండువగా సీసీఎల్

14
- Advertisement -

‘ఒకవైపు సినీ స్టార్స్, మరోవైపు క్రికెట్ ఈ అద్భుతమైన క్రీడా ఉత్సవానికి వేదికైన సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ ప్రేక్షకులకు కన్నుల పండగ. తెలంగాణ టూరిజం ఇందులో భాగం కావడం ఆనందంగా వుంది” అన్నారు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌-సీజన్ 10 లో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి హైదరాబాద్ లోని ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచులు జరుగనున్నాయి. తెలంగాణ టూరిజంలో సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ లో భాగమైయింది. ఈ నేపధ్యంలో తెలుగు వారియర్స్ టీమ్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రపంచ నలుమూలల సినీ, క్రీడా అభిమానులను, ప్రేక్షకులని ఈ లీగ్ ద్వారా అలరిస్తున్న ఎనిమిది జట్ల సభ్యులకు, నిర్వాహకులకు అభినందనలు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. సినీ స్టార్స్ ఈ విషయంలో అవగాహ కల్పిస్తే ఆ సందేశం ప్రజలకు మరింతగా చేరువౌతుంది. ఇలాంటి కార్యక్రమలకు మా ప్రభుత్వం, టూరిజం సహకారం ఎప్పుడూ వుంటుంది’అన్నారు.

తెలుగు వారియర్స్ టీమ్ సభ్యుడు, హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు. తెలంగాణ టూరిజం సిసిఎల్ లో భాగం కావడం ఆనందంగా వుంది. టూరిజంను ప్రమోట్ చేయడానికి మా వంతు ప్రయత్నిస్తాం. సిసిఎల్ పదో సీజన్ ఇది. ఈ పదేళ్ళలో లీగ్ గొప్పగా ఎదిగింది. విష్ణువర్ధన్‌ ఇందూరి గారి థాంక్స్. మార్చి 1, 2 తేదిల్లో మ్యాచులు ఆడుతున్నాం. అందరూ స్టేడియంకు వచ్చి సపోర్ట్ చేయాలి’ అని కోరారు

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. మాకు సపోర్ట్ చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు. ఉప్పల్ స్టేడియంలో తెలుగు వారియర్స్ మార్చి 1, 2 తేదిల్లో మ్యాచులు ఆడబోతుంది. క్రికెట్. సినిమా లవర్స్ అందరూ వచ్చి క్రికెట్ ని తెలుగు వారియర్స్ టీంని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.

హీరో సుశాంత్ మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి మా వంతుగా ప్రయత్నిస్తాం. మార్చి 1 నుంచి మ్యాచులు ఆడుతున్నాం. మీ అందరినీ అలరిస్తాం” అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు. టూరిజం సిసిఎల్ లో భాగం కావడం ఆనందంగా వుంది. మార్చి 1 నుంచి మ్యాచులు వుంటాయి. క్రికెట్ లవర్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేయాలి’ అని కోరారు.

తమన్ మాట్లాడుతూ..తెలంగాణ టూరిజం కు ధన్యవాదాలు. మా టీంను, ఈ క్రికెట్ లీగ్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు. మార్చి1 ఉప్పల్ లో కలుద్దాం” అన్నారు.

Also Read:ఐదో టెస్టు.. టీమిండియా జట్టు ఇదే !

- Advertisement -