- Advertisement -
ప్రపంచాన్నే గడ గడలాడిస్తున్న కరోనా వైరస్ భారిన పడ్డ తెలంగాణ వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి జాన్సన్ గ్రామర్ స్కూల్ సిబిఎస్ఈ చైర్మన్ సురేష్ కుమార్ రూ. 5 లక్షలు విరాళంగా అందించారు. ప్రగతి భవనలో మంత్రి కేటీఆర్‌ను కలిసి సురేష్ ఐదు లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. సామాజిక బాధ్యతతో సి.ఎం సహాయ నిధికి విరాళాన్ని అందించిన సురేష్ కుమార్ కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి పిలుపు మేరకు మరో పది రోజులపాటు లాక్ డౌన్‌ను పాటించి స్వీయ నియంత్రణలో ఉండాలని సూచించారు.
- Advertisement -