డిసెంబర్‌లో సీ టెట్ 2022ను నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది. ఈ మేరకు పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు సంబంధించిన తేదీలను అభ్యర్థుల అడ్మిట్ కార్డుల్లో తెలియజేస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 20 భాషల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్, అర్హత, లాంగ్వేజెస్, ఎగ్జామినేషన్ ఫీ, ఎగ్జామ్ సెంటర్లు, అప్లికేషన్ తేదీల వివరాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ https://ctet.nic.in/ లో త్వరలో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు పై వెబ్‌సైట్‌నుంచి ఇన్ఫర్మేషన్ బులిటెన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిగా చదువాలని, ఆ తర్వాతే దరఖాస్తు చేయాలని సీబీఎస్ఈ సూచించింది. త్వరలోనే అప్లికేషన్ తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. కాగా, జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు పేపర్-1 లేదా పేపర్- 2కు అప్లికేషన్ ఫీజు రూ. వెయ్యి, రెండు పేపర్లకు రూ. 1200గా నిర్ణయించింది. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌సీ అభ్యర్థులకు పేపర్-1 లేదా పేపర్-2కు రూ. 500, రెండు పేపర్లకు రూ. 600గా నిర్ణయించినట్లు సీబీఎస్ఈ పబ్లిక్ నోటీస్‌లో పేర్కొంది.