సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన సందేశాలతో యువతను ఉత్సాహపరుస్తుంటారు. యువతను ఉద్దేశిస్తూ.. తన ఉపన్యాసాలతో మార్గ నిర్దేశం చేస్తుంటారు. తాజాగా ఆయన నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్2 గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ కోసం యువత ప్రతి రోజు 2 గంటల సమయాన్ని వృద్ధా చేస్తున్నారని అన్నారు.
ఈ రియాల్టీ షో మొత్తం బిగ్ బాస్ చెప్పినట్లుగానే నడుస్తోందని చెప్పారు. బిగ్ బాస్ ఏం చెప్పితే.. అందులోని వారుఅది చేస్తారని
వారందరి మైండ్ ని బిగ్ బాస్ కంట్రోల్ చేస్తాడని, కానీ బిగ్ బాస్ మైండ్ మాత్రం ఎవరూ కంట్రోల్ చెయ్యలేరని చెప్పుకొచ్చారు.
అలాగే యువత కూడా తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలని, తమ మైండ్ ని వారి కంట్రోల్ ఉంచుకోవాలని సూచించారు. ఒకరు మనల్ని కంట్రోల్ చేసే విధంగా కాకుండా.. మనల్ని మనమే కంట్రోల్ చేసేలా ఉండాలని చెప్పారు. స్వామి వివేకానంద చెప్పినట్లు ముందు మన మనసుని కంట్రోల్ లో పెట్టుకోవాలని.. అప్పడు మైండ్ మన కంట్రోల్ లో ఉంటుందని తెలిపారు. ఇందుకోసం యువత ప్రాణాయామం చేయాలని సూచించారు