- Advertisement -
సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవి కాలం రెండేళ్ల నుంచే ఐదేళ్ళకు పొడిగిస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్ తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ‘సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ పదవి నియామకంపై తొలుత ఉన్న వ్యవధిని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, క్లాజ్(ఎ) కింద కమిటీ సిఫార్సుపై, రాతపూర్వకంగా కారణం నమోదు మేరకు ఒక్కసారికి ఒక్క ఏడాది వరకు పొడిగించవచ్చు’ అని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) ఆర్డినెన్స్ 2021లో కేంద్రం పేర్కొంది. అయితే ప్రాథమిక నియామకంలో పేర్కొన్న వ్యవధితో సహా మొత్తం ఐదు సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత అటువంటి పొడిగింపుకు అవకాశం లేదని ఆ ఆర్డినెన్స్‌లో కేంద్రం స్పష్టం చేసింది.
- Advertisement -