హీరోయిన్‎గా పనికిరావు అన్నారు…

253
Sudha

తమిళ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు నటి సుధ. అటు హీరోలకు, ఇటు హీరోయిన్‎లకు తల్లి పాత్రలలో సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నారు. హీరోయిన్‎గా కేరీర్ ప్రారంభించిన సుధ, తనకు అనుభవమైన సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

sudha

తాను తమిళంలో మూడు సినిమాలలో హీరోయిన్‎‎గా చేశానని, విలన్ పాత్రలతో అందరిని ఆకట్టుకునే రఘువరన్ హీరోగా చేసిన సినిమాలో ఆయన సరసన నటించానని చెప్పారు. అయితే కొన్ని రోజుల తర్వాత బాలచందర్ నన్ను పిలిపించారు. చూడమ్మా నీ ముఖం హీరోయిన్‎గా పనికి రాదని మొఖం మీదే చెప్పాశారు అంటూ చెప్పుకొచ్చింది.

నీవు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే క్యారెక్టర్ ఆర్టీస్టు పాత్రలో నటించు.. క్యారెక్టర్ ఆర్టీస్ట్ అయితే నీకు ఇష్టం వచ్చినంత కాలం ఉండొచ్చని.. లేదు హీరోయిన్‎గానే చేస్తానంటే ఉండలేవని చెప్పారంది, నీవు చేస్తానంటే హీరోయిన్‎కి సీక్వెల్‎గా సిస్టర్ క్యారెక్టర్ ఉంది, నీకు వారంలో రోజులు సమయం ఇస్తున్నాను ఆలోచించుకుని చెప్పు అన్నారు. ఆ రోజు ఆయన చెప్పడం వల్లే నేను ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పుకొచ్చారు నటి సుధ.