బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు..

731
bandla ganesh
- Advertisement -

సినీ నటుడు,నిర్మాత బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. బండ్ల గణేష్ తనకు రూ. 7 కోట్లు బాకీ ఉన్నారని, శుక్రవారం రాత్రి బండ్ల గణేష్ తో పాటు మరో 3 వ్యక్తులు తమ ఇంటికి వచ్చి బెదిరించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు పీవీపీ. దీంతో పోలీసులు గణేష్ పై 420, 448, 506 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన టెంపర్‌ సినిమాకి బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరించారు. టెంపర్ సినిమాకి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్‌ చేశారు. కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ అడుగుతున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌ పరారీలో ఉన్నాడు. బండ్ల గణేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలోనూ బండ్ల గణేష్‌ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -