100 కోట్ల క్లబ్ లో చిరు సైరా..!

575
syeraa
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైరా. సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖ్యంగా చిరంజీవి నటనకు అంతా ఫిదాఅయిపోయారు. ఇక వసూళ్లలోనూ సత్తాచాటింది సైరా. ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.

మొదటి రోజు 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సైరా రెండో రోజు కూడా పాతిక కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. రెండో రోజు 10 కోట్లకు పైగానే డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది.

మొత్తంగా మూడు రోజుల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి దూసుకుపోతోంది. వీకెండ్,దసరా సెలవులు కావడంతో శని,ఆదివారాల్లో కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ వీకెండ్‌కి 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్‌ని టచ్ చేస్తుందని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాభాల బాటపట్టారు.

- Advertisement -