వక్షోజాలు కనిపించేలా స్టిల్ – కేసు నమోదు

448
model Gilu Joseph
- Advertisement -

బహిరంగంగా పసిబిడ్డకు పాలిస్తే తప్పేంటని అమ్మలకు బాసటగా నిలుస్తూ ప్రముఖ మలయాళ మ్యాగజైన్‌ ‘గృహలక్ష్మీ’ ప్రత్యేక సంచికను విడుదల చేసింది. మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మలయాళీ మోడల్‌ గిలు జోసెఫ్‌ పాలిస్తున్న ఫొటోను ప్రచురించారు. ఈ ఫొటోపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం నెలకొంది. ఉద్దేశం మంచిదైనా పెళ్లికాని జోసెఫ్‌ ఫొటోను ముద్రించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కవర్‌ పేజీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినోద్‌ మాథ్యూ అనే కేరళ న్యాయవాది మహిళల అసభ్య ప్రాతినిధ్య (నిషేధం) చట్టం, 1986 కింద మ్యాగజైన్‌ పబ్లిషర్‌, మోడల్‌ జోసెఫ్‌లపై ఫిర్యాదు చేశారు.

 model Gilu Joseph

అయితే తనపై వస్తున్న విమర్శలపై నటి జోసెఫ్‌ స్పందించారు. ‘గృహలక్ష్మీ మ్యాగజైన్‌ ఓపెన్‌ బ్రెస్ట్‌ఫీడింగ్‌ ప్రచారంలో భాగస్వామినని గిలు జోసెఫ్‌ తెలిపారు. సమాజం తల్లులకు బహిరంగంగా పాలిచ్చేసౌకర్యం కల్పించడంలేదన్నారు. ఈ విషయంలో తల్లులు భయపడాల్సిన, సిగ్గుపడాల్సినవసరం లేదని జోసెఫ్‌ పిలుపునిచ్చారు.

- Advertisement -