సరికొత్త గేమ్‌తో విజయ్ దేవరకొండ…

249
vijay devarakonda
- Advertisement -

యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న తెలుగు యువకథానాయకుల జాబితాలో విజయ్ దేవరకొండ పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన అరడజను వరకూ సినిమాలు చేస్తున్నాడు. ఒకదాని తరువాత ఒకటిగా ఇవి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పుడు శ్రీధర్ మర్రి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘ఏ మంత్రం వేశావే’ సినిమా చేశాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా శివానీ సింగ్ నటించింది.

vijay devarakonda

అయితే ఈ సినిమా అర్జున్ రెడ్డి చిత్రానికంటే ముందు నుండే షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప‌లు కార‌ణాల వ‌ల‌న చిత్ర నిర్మాణం వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు మార్చి 9న ఈ మూవీని విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ట్విట్ట‌ర్‌లో నాకు కూడా బ్యాక్ లాగ్స్ ఉన్నాయబ్బా.. ‘ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేద్దామని అనుకున్నా.. కానీ, ఐదేళ్ల తర్వాత ‘యూట్యూబ్’లో ట్రెండ్ అవుతోంది’ అని పేర్కొన్నాడు. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పే ‘బ్యాక్ లాగ్స్’ చ‌దువుకి సంబంధించి కాదు. ఐదేళ్ళ క్రితం ప్రారంభ‌మైన త‌న సినిమా ఏ మంత్రం వేసావే గురించి. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది ‘యూ ట్యూబ్’ ట్రెండింగ్ లో నాల్గో స్థానంలో ఉంది.

- Advertisement -