హీరో సిద్దార్థపై కేసు నమోదు

522
Actor Siddharth
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుపై దేశ వ్యాప్తంగా పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడా చూసిన ఆందోళకారుల నిరసనల జ్వాలతో అట్టుడికిపోతోంది. చైన్నైలో కూడా పౌరసత్వ సవరణ బిల్లుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా చైన్నైలోని వళ్లువార్ కొట్టంలో విద్యార్దులు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిర్వహించిన ఈ నిరసనలో హీరో సిద్ధార్థ్ కూడా పాల్గొన్నాడు.

ఈ ఆందోళనలో పాల్గోన్న నిరసన కారులపై కేసు నమోదు చేశారు చైన్నై పోలీసులు. ర్యాలీకి అనుమతి లేదంటూ పలువురిపై 143 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈక్రమంలో హీరో సిద్దార్ధ్ పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. సిద్ధార్థ్ తో పాటు దాదాపు 600 మంది నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. ఈవిషయంపై హీరో సిద్దార్ద్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి మరి.

- Advertisement -