కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు

7
- Advertisement -

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసింది ఓ మహిళ. బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న తన అనుచరులతో ఆమెను అత్యాచారం చేయించి, ముఖంపై మూత్రం పోసారని పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ.

2023 జూన్ 11వ తేదీన తనపై ఉన్న తప్పుడు కేసులు అన్ని కొట్టేస్తానని నమ్మించి ఎమ్మెల్యే కార్యాలయానికి పిలిపించి, తన అనుచరులతో అత్యాచారం చేయించి, మునిరత్న తన ముఖంపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపించింది మహిళ.

అదే సమయంలో తనకు ఒక సిరంజితో ఇంజెక్షన్ చేశారని, జనవరిలో ఆసుపత్రిలో చేరగా నయం చేయలేని వైరస్‌గా వైద్యులు నిర్ధారించారని ఆరోపించింది మహిళ. ఆ మహిళ ఫిర్యాదు మేరకు బీజేపీ ఎమ్మెల్యే మరియు అతని అనుచరులపైన కేసు నమోదు చేశారు పోలీసులు.

Also Read:వడగళ్ల వర్షం..విమానం ధ్వంసం!

- Advertisement -