ఆ దేశాన్ని భయపెడుతున్న వింతవ్యాధి..!

75
canada

ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతున్న ప్రజలకు ఏదైన కొత్త రకం వైరస్ వచ్చిందనే పేరు చెబితేనే వణికిపోతున్నారు. అయితే కెనడా ప్రజలను వింత వ్యాధి భయపెడుతోంది. నిద్రలేమి, కండరాల బలహీనత, భ్రమ, పీడకలల భయం లాంటి లక్షణాలతో తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది.

కెనడాలోని న్యూబ్రన్స్‌విక్‌ ప్రావిన్స్‌లో ఎక్కువ మంది ఈ వింత వ్యాధి బారిన పడుతున్న వారిసంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు 48 మంది ఈ లక్షణాలతో దవాఖానల్లో చేరగా శాస్త్రవేత్తలకు సైతం ఇది అంతుచిక్కడం లేదు. ఈ వ్యాధితో మరణించి ఆరుగురి మెదడులపై పరిశోధనలు నిర్వహించినా వ్యాధికి గల కారణం ఏంటన్నది తెలియరాలేదు.