ఆరోగ్య‌సేతులో కొత్త ఫీచ‌ర్‌..

25
aarogya setu

క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలను అందిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఆరోగ్య‌సేతు యాప్‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా న‌మోదువుతోన్న కేసుల వివ‌రాలు, యూజర్ల‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న కొవిడ్ రోగుల వివ‌రాల‌ను అందిస్తుంది.

తాజాగా ఆరోగ్య సేతు యాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చారు. యూజ‌ర్ రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్న‌ట్ల‌యితే.. యాప్‌ హోమ్ స్క్రీన్ డబుల్ బార్డర్‌ను చూపడంతో పాటు, ఆరోగ్య సేతు లోగోలో రెండు బ్లూ టిక్స్ డిస్ ప్లే చేస్తుంది. ఒక వేళ సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే.. వారికి హోమ్ స్క్రీన్‌పై పార్షియల్లీ వ్యాక్సినేటెడ్ స్టేటస్‌తో పాటు ఒకే టిక్‌తో ఆరోగ్య సేతు లోగో డిస్ ప్లే అవుతుంది.