నా డ్రెస్ చూసి ఎలాంటి వ్యక్తినో మీరు చెప్పగలరా?

535
Mamatha Benerji
- Advertisement -

ప్రధాని మోదీపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. క్యాబ్ కు వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు చేపడుతున్న వారిని వాళ్లు వేసుకున్న దుస్తుల ద్వారా గుర్తు పట్టవచ్చని అన్నారు మోదీ. ఈ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ స్పందిస్తూ డ్రెస్ ఆధారంగా ఓ వ్యక్తి ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. కేవ‌లం డ్రెస్ కోడ్ ఆధారంగా ఒక‌ర్ని మంచిగా, మ‌రొక‌ర్ని చెడుగా చూడ‌లేమ‌న్నారు. నేను క‌ట్టుకున్న‌ చీరు చూసి, నేను మంచో చెడో అన్న కామెంట్‌ను ఎవ‌రైనా చేయ‌గ‌ల‌రా అని అడిగారు.

దేశ వ్యాప్తంగా నిరసనలతో అట్టుడుకుతుంటే దేశం వారు మాత్రం మీరు వేసుకుంటున్న దుస్తుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. క్యాబ్‌కు వ్య‌తిరేకంగా రెండ‌వ రోజు కోల్‌క‌తాలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ధర్నా చేపట్టారు. పలువురు సినీ తారలు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గోన్నారు. కాగా ఆదివారం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్ర పక్షాలు అశాంతిని పోషిస్తున్నాయన్నారు. అనుకున్నది సాధించలేకపోతుండటంతో వారు గృహ దహనాలకు కూడా పాల్పడుతున్నారు. కొందరు నిప్పంటిస్తున్న దృశ్యాలను టీవీల్లో కూడా చూశాం. వారు వేసుకున్న దుస్తులను బట్టి వారు ఎవరో గుర్తించవచ్చు అని మోదీ అన్నారు.

- Advertisement -