నా యాక్టింగ్‌లో ప్రొగ్రెస్ లేదు.. : రజనీ

559
rajinikanth
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల క్రేజి కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు రజనీకాంత్. తన 45 సంవత్సరాల సినీ కెరీర్‌లో నటనలో ఎలాంటి ప్రొగ్రెస్ లేదన్నారు. సినీ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నటించాలంటే కాసింత సిగ్గు,ఒత్తిడి ఉండేదని కానీ తర్వాత తనలో కాన్ఫిడెన్స్‌ పెరిగిందన్నారు. అయితే ఇన్ని సంవత్సరాల తన సినీ జీవితంలో వెనక్కితిరిగి చూసుకుంటే తన నటనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు.

హీరోల నటన దర్శకుడి ప్రతిభపై ఆధారపడి ఉంటుందని అన్నారు. కొంతమంది హీరోలు నాచురల్‌గా నటిస్తారని మరికొంతమంది స్పాంటేనియస్‌గా స్పందిస్తారన్నారు.

ఆఫ్‌ స్క్రీన్- ఆన్‌ స్క్రీన్ ఏదైనా తనకు స్పూర్తి బిగ్ బి అమిత్ బచ్చన్ అన్నారు. అమిత్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని తనకు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన సలహాలు ఎప్పటికి మర్చిపోలేనని చెప్పారు. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయమని చెప్పారని,ఇతరుల మాటల పట్టించుకోవద్దని ఏది అనిపిస్తే అది చేయాలని చెప్పారన్నారు. ఇక రాజకీయాల్లో రావొద్దని చెప్పారని కానీ తాను ఫస్ట్ రెండు పాటించి మూడో విషయంలో లెక్క తప్పానని చెప్పారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో విషయాలను బిగ్ బి నుంచి నేర్చుకున్నానని చెప్పారు. రజనీ సరసన నయనతార నటించిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

Doesn’t see any progress in acting: Rajinikanthsuperstar rajinikanth says he doesnt see any progress in his acting.

- Advertisement -