కారోనా కష్టకాలంలో పేదలకు అండగా ఉండేందుకు ఎంతో మంది దాతలు మనవత్వంతో వస్తున్నారు. ఈ నేపథ్యంలో తమవంతుగా సాయం చేస్తున్నారు కల్వరి టెంపుల్ పాస్టర్ డా. సతీష్ కుమార్. ఆయన ఆధ్వర్యంలో నిరుపేదలకు కుల,మతం, ప్రాంతీయ భేదం లేకుండా ఆకలిని తీర్చే ఉద్దేశంతో సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.లాక్‌డౌన్ ప్రారంభం నుండి ఇప్పటివరకు దాదాపు (600 టన్నులు సరుకులు) 30 వేల కుటుంబాలకు నెల రోజులు సరిపడా నిత్యావసర సరుకుల కిట్‌లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు చేస్తున్న మంచి పని తెలుసుకొని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం కల్వరి టెంపుల్‌ను సందర్శించారు. అక్కడ పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించి.. వారు చేస్తున్న సేవలు బాగున్నాయని కొనియాడారు. ఇలాంటి అపత్కాలంలో కుల,మతాలకు అతీతంగా సేవ చేసేవారే అసలైన సేవకులని.. వారికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి.