ఈ అకడమిక్ ఇయర్ నుంచే ఇంగ్లీష్ మీడియం- మంత్రి సబితారెడ్డి

81
Minister sabitha
- Advertisement -

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం అమలుపై విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ ఈరోజు భేటీ అయ్యింది.

ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. స్టూడెంట్స్ కి మరింత మంచి ఫ్యూచర్ అందించే దిశగా కేబినెట్ సబ్ కమిటీలో చర్చించామన్నారు. విద్యా శాఖ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. ‘మన ఊరు మన బడి’ కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి కేసీఆర్‌ రూ.7 వేల కోట్లు కేటాయించారని చెప్పారు.

జూన్ 12 నుంచి అకడమిక్ ఇయర్ ప్రారంభ కానుందని తెలిపిన ఆమె… ఈ అకడమిక్ ఇయర్ నుంచే 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ఇక స్కూల్స్ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి శ్రీనివాస్ గౌడ్, దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -