56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక..

170
election 2020

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న లోక్ సభ, శాసనసభ స్థానాల ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఒక లోక్ సభ స్థానం, 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్ మినహా మిగిలిన 54 స్థానాలకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు అక్టోబర్ 16. నవంబర్ 3న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 10 ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఇక మణిపూర్ 2 అసెంబ్లీ స్థానాలు, బీహార్ లోని ఒక లోక్ సభ స్థానానికి అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల కానుండగా. నవంబర్ 7న పోలింగ్, నవంబర్ 10న ఓట్ల లెక్కింపు జరుగనుంది. కరోనా నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఎన్నో మార్పులు తెచ్చారు. పోలింగ్ కేంద్రాలను పెంచడంతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో శానిటైజర్లు అందుబాటులో ఉంచుతారు. ఇక ఈ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాయి.