దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల..

259
Election Schedule

మెద‌క్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దివంగత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్ప‌టికే ఆయా పార్టీలు ప్ర‌చార ప‌ర్వాన్ని మొద‌లు పెట్టాయి. ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌డంతో నేటి నుంచి దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రానుంది.

ఎన్నికల ముఖ్యమైన తేదీలు..

అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల.
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు అక్టోబర్ 16.
నవంబర్ 3 న పోలింగ్.
నవంబర్ 10 ఓట్ల లెక్కింపు.