బట్లర్ విధ్వంసం…స్మిత్ ఫిదా

276
jos buttler
- Advertisement -

ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ ప్రపంచంలో విధ్వంసక బ్యాట్స్‌మెన్ అని స్పష్టం చేశాడు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్. రాజస్ధాన్ రాయల్స్‌కు గత రెండు సీజన్స్‌లో బట్లర్‌తో కలిసి ప్రాతినిధ్యం వహించిన స్మిత్..బట్లర్‌ ఆటకు ఫిదా అయ్యానని తెలిపారు. బట్లర్‌తో క్రీజు పంచుకోవడం గొప్ప విషయమని అతడి నుంచి ఎంతో నేర్చుకున్నాని చెప్పారు. ఏడాది పాటు క్రికెట్ నుండి నిషేధం తర్వాత ఆసీస్ జట్టులో చోటుసంపాదించుకున్న స్మిత్ సోషల్ మీడియా లైవ్ ఇంటరాక్షన్‌లో వార్నర్ తో కలిసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రాజస్థాన్ రాయల్స్ గ్రేట్ ఫ్రాంఛైజీ అని చెప్పిన స్మిత్ ఈ సంవత్సరం మెరుగైన ఆటతో ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటామని చెప్పారు. ఆసీస్ జట్టులో పునరాగమం చేయడం చాలా ఆనందాన్నిస్తోందని స్మిత్, వార్నర్ వ్యాఖ్యానించారు. ఆసీస్‌ జట్టుకు పూర్వ వైభవం తీసుకుని రావడానికి శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు. త్వరలో జరగబోయే ప్రపంచకప్ టోర్నీలో జట్టును గెలిపిస్తామని భారత్ లో ఆడటం తనకు ఇష్టమని తెలిపాడు. డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో సభ్యుడు కాగా, స్మిత్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ తరుపున ఆడబోతున్నాడు.

క్రికెట్‌ ప్రపంచంలో బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ప్రకంపనలు సృష్టించింది. ఆ జట్టు మూలస్తంభాలుగా భావించే డేవిడ్ వార్నర్,స్మిత్‌లపై ఏడాదిపాటు నిషేధం విధించడానికి కారణమైంది. నిషేధ కాలం ముగియడంతో వారిద్దరూ జట్టులో పునరాగమనం చేశారు. పాకిస్తాన్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ చోటు సంపాదించారు.

- Advertisement -