అమ్మ అయిన ప్రముఖ సింగర్..

41
Shreya Ghoshal

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ కు పుత్రోదయం అయింది. ఆమె శనివారం పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఆ దేవుని ఆశీర్వాదంతో పండంటి మ‌గ‌బిడ్డ పుట్టాడు. నేను, శైలాదిత్య‌, కుటుంబ స‌భ్యులంద‌రూ సంతోషంగా ఉన్నాం. ఇలాంటి ఎమోష‌న్‌ను ఎప్పుడూ పొంద‌లేదు. మా చిన్నారికి ఆశీర్వాదాలు పంపిన మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు’’ అని అన్నారు శ్రేయా ఘోష‌ల్‌. 2015లో శ్రేయా ఘోష‌ల్ త‌న స్నేహితుడు శైలాదిత్య‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.