- Advertisement -
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. 200 అడుగుల లోయలో బస్సు పడింది. మండి జిల్లా ప్రతీఘాట్ వద్ద 30 మంది ప్రయాణికులతో నిండిన బస్సు అదుపుతప్పి లోయలో పడగా 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. మండి జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైందని డీఎస్పీ సర్కాఘాట్ సంజీవ్ గౌతమ్ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణంకావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Also Read:క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!
- Advertisement -

