- Advertisement -
ఎట్టకేలకు కర్ణాటకలో థగ్ లైఫ్ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఉన్నందున, వివాదాలతో సంబంధం లేకుండా కర్ణాటకలో విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అనుమతి పొందిన సినిమాను విడుదల చేయాల్సిందే. చట్టబద్ధమైన పాలన ఇదే చెబుతోంది అని న్యాయస్థానం తెలిపింది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, సినిమా విడుదలకు భద్రత కల్పించడంలో విఫలమైనందుకు కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
Also Read:క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!
- Advertisement -

