ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి దిగిన విషయం తెలిసిందే. ఏషియన్ థియేటర్స్‌తో కలిసి తాను నిర్మించిన ‘AAA సినిమాస్’ థియేటర్ ని అల్లు అర్జున్ ఈ రోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని చేతులమీదుగా ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నాడు. కాగా ఈ మల్టీప్లెక్స్ లో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ తొలి సినిమాగా విడుదల కానుంది. కాగా, అమీర్‌పేట్ సత్యం థియేటర్ స్థానంలో ఈ గ్రాండ్ మల్టీప్లెక్స్‌ను అత్యాధునిక హంగులతో నిర్మించారు. దీంతో ఈ మల్టీప్లెక్స్ పై ఇప్పుడు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రైమ్ ఏరియాలో ఇది ఉండటం దీనికి ఇప్పుడు బాగా కలిసి వచ్చింది.
Also Read: మళ్లీ సంక్రాంతి బరిలో చిరు!
సహజంగానే ఈ మల్టీప్లెక్స్ కి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఈ మల్టీప్లెక్స్ లో సీటింగ్ కూడా చాలా బాగుంది అని టాక్. అలాగే ఏసీ వంటి సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి.. ఈ మల్టీప్లెక్స్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. పైగా అల్లు అర్జున్ కూడా అందరి నిర్మాతలతో తమ సినిమాల ప్రీమియర్స్ ను ఈ మల్టీప్లెక్స్ లోనే ప్రదర్శించేలా ప్లాన్ చేస్తున్నాడు. సో.. ఏ రకంగా చూసుకున్నా.. ఈ మల్టీప్లెక్స్ కి ఫుల్ డిమాండ్ ఉండనుంది. ఎలాగూ స్టూడెంట్స్, లవర్స్ ఎక్కువగా ఈ మల్టీప్లెక్స్ కి వస్తారు. కాబట్టి.. బన్నీకి లాభాల పంట పడనుంది. మరి భవిష్యత్తులో మరిన్ని మల్టీప్లెక్స్ లు బన్నీ ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది.
Also Read: Salaar:ప్రభాస్ సాయం మరువలేనిది