Bunny:బన్నీ ఫ్యాన్స్‌కి పుష్ప డ‌బుల్ ట్రీట్ !

67
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న పుష్ప‌ 2 సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటూ, యావత్తు ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది. ఈ సినిమా నుంచి బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఏప్రిల్ 7న ఫస్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ లుక్‌ లో బ‌న్నీ అంద‌ర్నీ మెస్మ‌రైజ్ చేస్తాడ‌ని టాక్. ఇది కాకుండా బ‌ర్త్‌ డే రోజున విషెస్ చెప్తూ మొద‌ట్లో షూట్ చేసిన టీజ‌ర్ గ్లింప్స్‌ని రిలీజ్ చేయ‌నుంద‌ట టీమ్. మొత్తానికి బ‌న్నీ ఫ్యాన్స్‌ కు డ‌బుల్ ట్రీట్ ఖాయంగా కనిపిస్తోంది.

ఇక అల్లు అర్జున్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూరైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘సినీ ఇండస్ట్రీలో నువ్వు 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది బన్నీ. నువ్వు పాన్ ఇండియా స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా ఎదగడాన్ని చూసి ఆనందిస్తున్నాను. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, మరెన్నో హృదయాలను గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

అల్లు అర్జున్‌ – రామ్ చరణ్ మధ్య గ్యాప్ పెరిగింది అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యాన్స్ బన్నీ పై విరుచుకు పడుతున్నారు. దీనికితోడు చరణ్ పుట్టినరోజు నాడు బన్నీ సోషల్ మీడియాలో విష్ చేయలేదు. ఇది కూడా బన్నీ పై విమర్శలకు కారణం అయ్యింది. ఇది అంతా గమనించిన చిరంజీవి పైవిధంగా ట్వీట్ చేసి.. బన్నీ – చరణ్ ఒక్కటే అని చెప్పారు.

ఇవి కూడా చదవండి…

raviteja:రావణాసుర ట్రైలర్ విడుదల

ఎన్టీఆర్ నటనకు బ్రహ్మరథం!

Venu Swamy: ప్చ్.. అతగాడి మాయలో హీరోయిన్లు

- Advertisement -