త్రివిక్రమ్ – బన్నీ..అప్ డేట్!

39
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేయగా రోజుకో వార్త ఈ సినిమా గురించి చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది.రెండు పాత్రల్లో ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ అని తెలుస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ లోనే అల్లు అర్జున్ రెండో పాత్ర రివీల్ అవుతుందని…ఇది సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలస్తుందని టాక్. నవంబర్ తర్వాత ఈ సినిమాని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో హిట్ చిత్రాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో హారిక & హాసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో నూతన వధువరులు..

- Advertisement -