ఉభయ సభలు నిరవధిక వాయిదా…

25
- Advertisement -

భారత శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్ణీత కాలం కంటే ముందుగా ముగిశాయి. పార్లమెంట్ ఉభయసభలను సభాపతులు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల జరిగిన పార్లమెంటరీ బిజినేస్‌ అడ్వయజరీ కమిటీ సమావేశంలో షెడ్యూల్‌ కంటే ముందే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను ముగించాలని నిర్ణయించారు. అనుకున్న తేదీల కంటే ముందుగా దాదాపుగా వారంరోజుల ముందుగా నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

గడిచిన శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగింది. తవాంగ్‌ ఘర్షణ నేపథ్యంలో గత వారం రోజులుగా పార్లమెంటు ఉభయసభలు వాయిదాల మధ్య కొనసాగింది. అయితే గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో పార్లమెంటును వాయిదా వేశారు.

ఈ శీతాకాలం సెషన్‌లో కొన్ని చట్టాలను సవరించారు. వాటిలో రాజ్యంగపరమైన షెడ్యూల్ తెగల (ఆర్డర్) 1950 సవరణలు ఆమోదించబడింది. వన్యప్రాణుల రక్షణ (సవరణ) బిల్లు (2021), ఇంధన సంరక్షణ (సవరణ) బిల్లు (2022), సముద్రపు పైరసీ నిరోధక బిల్లు 2019లను ఆమోదించారు. లోక్‌సభ మొత్తమీద 62గంటల42నిమిషాల పాటు నిర్వహించినట్టుగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి…

కరోనా అంతం కాలేదు…మోదీ

టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌ గా మార్పు.. పార్లమెంట్‌లో స్పందన

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌

- Advertisement -