బన్నీ….. క్రిస్మస్ ‘ట్రీ’

101
Bunny Christmas Celebrations

ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడి నెలకొంది. క్రిస్మస్ అంటే కేవలం క్రైస్తవులు జరుపుకునే పండుగ అనే భావన ఎప్పుడో పోయింది. ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఏ పండుగ వచ్చినా సరే దాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక మన సెలబ్రేటీలు కూడా ప్రతి పండుగను చాలా గ్రాండ్ గా చేసుకుంటూ వారికి పండుగాలంటే ఎంత ఇష్టమో తెలియచేస్తున్నారు. ఈమధ్య నాగచైతన్య, సమంత ఇద్దరూ కలసి క్రిస్మస్ త్రీని డెకరేట్ చేయడం చూశాం. ఇక తాజాగా మరో స్టార్ హీరో సైతం తన ఇంట్లో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తూ కనిపించాడు.

క్రిస్మస్ ట్రీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ‘క్రిస్మస్ ట్రీని అలంకరించడమంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి ప్రతి ఏడాది క్రిస్మస్ ట్రీని అలంకరిస్తూ ఉండేవాడిని. మెర్రీ క్రిస్మస్’ అని బన్నీ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

Bunny Christmas Celebrations

ఆ చెట్టుకు ఏం కట్టాలి? ఏ రంగుల కాగితాలు అమర్చాలి, ఎటువంటి రంగుల లైట్లు ఏర్పాటు చేయాలి.. నుంచి బెల్స్, స్టార్స్, రిబ్బన్స్, గిఫ్ట్స్ వంటి విషయాలను బన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట. ఈ ఫొటో చూస్తేనే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఏదేమైనా హీరోలు కులమతాలకతీతంగా అన్ని పండుగలు చేసుకోవడం మంచి సంప్రదాయమనే చెప్పాలి.

Bunny Christmas Celebrations