- Advertisement -
కేంద్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మరికొన్నిరోజుల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 20 రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. జూలై 5న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఈ క్రమంలో జూన్ 19న లోక్ సభ స్పీకర్ ఎన్నిక చేపడతారు. తొలి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత ఇది తొలి సమావేశం. రెండోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు.
- Advertisement -