ముగిసిన కేంద్ర కేబినెట్ తొలి సమావేశం..

277
first Union cabinet meeting
- Advertisement -

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ నేడు సమావేశం జరిగింది. సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి మోడీ ప్రధానిగా రెండో సారి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మోడీ సహా 58 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత ఇది తొలి సమావేశం ఇదే. భారత రక్షణ నిధి ద్వారా ఉపకార వేతనాలు ఇచ్చే కార్యక్రమంపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బాలురకు ఇప్పటి వరకు ఉన్న ఉపకార వేతనం రూ. 2 వేల నుంచి రూ.2500లకు పెంచారు. బాలికలకు రూ.2250 నుంచి రూ.3000లకు పెంచారు. ఇప్పటి వరకు కేంద్ర పారామిలటరీ బలగాలకు మాత్రమే ఉన ఉపకార వేతనాలు రాష్ట్రాలకూ విస్తరించారు.

first Union cabinet meeting

రాష్ట్ర పోలీసు విభాగానికి కూడా ఉపకారవేతనాలు వర్తించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి రాష్ట్రం నుంచి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగం పిల్లలను ఎంపిక చేసి వారికి ఉపకార వేతనాలు అందిస్తారు. వీటన్నింటికి కేంద్ర హోంశాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా ఉండనుంది.

సుమారు గంట పాటు సాగిన ఈ కేబినెట్ సమావేశంలో ప్రధాని స్కాలర్ షిప్ స్కీమ్, పలు అంశాలపై చర్చించించారు. ప్రధాని కార్యాలయంలో మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో హోంమంత్రి అమిత్‌షా సహా 24మంది కేబినెట్‌ మంత్రులు, 9మంది స్వతంత్ర హోదా కల్గిన మంత్రులు పాల్గొన్నారు.

- Advertisement -