Budget 2024: మధ్యంతర బడ్జెట్ అంటే ఇదే?

21
- Advertisement -

2024-25 సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. ఆరోసారి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ని ప్రవేశ పెట్టనుండగా ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌ని మోడీ సర్కార్ ప్రవేశ పెట్టనుంది.

అసలు ఈ మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటంటే..?రాజ్యాంగంలోని 116 సెక్షన్ ప్రకారం మధ్యంతర బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ ను ప్రవేశపెడ్తారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రభుత్వానికి వచ్చే రాబడులు, ప్రభుత్వం చేసే వ్యయాలను మధ్యంతర బడ్జెట్ లో వివరిస్తారు. మధ్యంతర బడ్జెట్ తాత్కాలిక కాలానికి సంబంధించిన ఆర్థిక వివరాలను మాత్రమే అందిస్తుంది. ఆ తర్వత ఏర్పడే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ని ప్రవేశ పెడుతుంది.

2024 ఏప్రిల్, మే నెలల్లో లోక సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం 2024 జూలైలో పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఎన్నికల సమయంలో ఓటర్లపై అనవసరమైన ప్రభావం పడకుండా భారత ఎన్నికల సంఘం విధించిన కొన్ని పరిమితులు పరిధిలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడ్తారు. అధికార పక్షానికి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం బడ్జెట్లో ప్రధాన పన్నులు లేదా విధాన సంస్కరణలను ప్రతిపాదించదు. ఓట్ ఆన్ అకౌంట్ రెండు నెలల పాటు అమల్లో ఉంటుంది. అవసరమైతే పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.

Also Read:రాహుల్‌కు షాకిచ్చిన దీదీ!

- Advertisement -