తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ దెబ్బే?

24
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను ఫిబ్రవరి 2న ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కావడంతో మోడీ సర్కార్ ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది. బడ్జెట్ కేటాయింపులు ఎలా జరపబోతుంది అనే చర్చ జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరాల జల్లు ఏమైనా కురిపిస్తుందా అని రెండు రాష్ట్రాల ప్రజలు ఆశగా ఎదురు చూశారు. అయితే ఈ మద్యంతర బడ్జెట్ లో మహిళా, యువత, రైతులు.. ఆయా రంగాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు జరిపిన కేంద్రం.. ఎప్పటిలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ లో కూడా నిరాశే మిగిల్చింది. ఏపీకి సంబంధించి ఎన్నో అంశాలు తరచూ చర్చకు వస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అంశం ఒకటి. దీనిపై ఈ badjet లో కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు మోడీ సర్కార్ .

ఇంకా విశాఖ ప్రైవేటీకరణ రద్దు అంశం అసలు చర్చకే రాలేదు. ఇక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉన్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కోసం కూడా ఎలాంటి కేటాయింపులు జరపలేదు. అటు తెలంగాణ విషయంలో కూడా మొండిచేయి చూపించింది కేంద్రం. ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్న బయ్యారం ఉక్కు కర్మాగారం, సింగరేణి అంశం, మణుగూరు ప్లాంట్ నిధుల కేటాయింపు ఇలా దేనిపై కూడా కేంద్రం తీపి కబురు వినిపించలేదు. దీంతో కేంద్రానికి రెండు తెలుగు రాష్ట్రాలపై ఎందుకింత చిన్న చూపు అనే చర్చ జరుగుతోంది. ఇవే కాకుండా రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు,. వంటి అంశాల ఊసే లేదు. ఓవరాల్ గా చూస్తే. ఈ మద్యంతర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదనే టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ బడ్జెట్ ను కేవలం ఎన్నికల మేనిఫెస్టో మాదిరిగానే రూపకల్పన చేశారా ? అనే విమర్శలు కూడా వ్యక్తమౌతున్నాయి. మొత్తానికి మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ లో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు నిరాశ తప్పలేదు.

Also Read:బిగ్ బాస్ అమర్ దీప్ హీరోగా సినిమా

- Advertisement -