- Advertisement -
ప్రజలు స్థిరమైన పాలనకు ఓటేశారని తెలిపారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. లోక్ సభలో 2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా అందరూ ఉత్సాహంగా ఓటేయండంతోనే మా విజయం సాధ్యమైందన్నారు. ఐదేళ్లలో మోడీ సర్కార్ అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు.
ప్రజలే నూతన భారతావననిని ఆవిష్కృతం చేశారు. పేదల సంక్షేమానిక అనేక పథకాలు తెచ్చామన్నారు. ఆహార భద్రతకు వ్యయం రెట్టింపు చేశామని తెలిపారు. ఉర్దూలో కవితను చదివి వినిపించారు నిర్మలా. మేకిన్ ఇండియాతో అద్బుతాలు సాధించామన్నారు.
1971లో ప్రధానిగా ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టగా 48 ఏళ్ల తర్వాత పూర్తిస్ధాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు.
- Advertisement -