పాడి బాగుంటేనే వ్యవసాయం వర్థిల్లుతుంది:జగదీష్ రెడ్డి

346
jagadeesh reddy
- Advertisement -

పాడి బాగుంటేనే వ్యవసాయం వర్ధిల్లుతుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో గాలి కుంట వ్యాధి నివారణ టికాల కార్యక్రమాన్ని మంత్రి తలసానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి పాలల్లో కూడా కల్తీ జరుగుతోందన్నారు. దీనిని అరికట్టడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక మైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.

విరివిగా పాడి పరిశ్రమ కు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని చెప్పారు. పాడి వైపు రైతులను మళ్లీంచారని……గొర్రెల పంపిణీ తో అద్భుతమైన మార్పు సాధించామన్నారు. యాదవులు స్వయం సమృద్ధి సాధించారని తెలిపిన మంత్రి …పాడి ,పంటలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పశు సంపదను పెంపొందించాలనే ఉద్దేశ్యం తో పశువులు కు టికల పంపిణీ ని ప్రభుత్వం చేపట్టిందన్నారు మంత్రి తలసాని. ఆసుపత్రిలను,అంబులెన్స్ లను ఏర్పాటు చేసి గ్రామాల్లోకి స్వయంగా వెళ్లి పశువులు కు ఉచితంగా చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

వ్యాధులను అరికట్టి పాడి పరిశ్రమ ను కాపాడుకుంటే రైతులు మరింత స్వయం సమృద్ధి సాధిస్తారన్నారు.టీకాలు వెయిస్తే గేదెలు పాలు తక్కువగా ఇస్తాయి అని అనుకోవడం అపోహ మాత్రమేనని…రైతులు డాక్టర్స్ చెప్పే సలహాలు పాటించి తమ పాడి ని కాపాడుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మదర్ డైరీ ఛైర్మెన్ గుత్తా జితేందర్ రెడ్డి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.

- Advertisement -