కొత్తగా 24 మెడికల్ కాలేజీలు…

193
Budget 2018 LIVE Updates
- Advertisement -

ప్రతీ మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని అరుణ్‌ జైట్లీ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన జైట్లీ విద్యకు పెద్దపీట వేస్తామని చెప్పారు. వడోదరాలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నరు. త్వరలో 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలు..కొత్తగా 24 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్ధుల కోసం రూ. 16 వేల కోట్లు,4 కోట్ల ఇళ్లకు ఉచిత్ విద్యుత్ అందిస్తామన్నారు.

విద్యారంగంలో మౌలిక సౌకర్యాలకు రూ.లక్ష కోట్లు…2017 జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ఆయుష్మాన్‌ భారత్‌. ఆరోగ్య కేంద్రాలకు రూ.1200కోట్లు…ఆదివాసీ బాలలకు ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటుచేస్తామన్నారు.బ్లాక్‌బోర్డు నుంచి డిజిటల్‌ బోర్డు: కార్యక్రమంలో భాగంగా డిజిటల్‌ విద్యా కేంద్రాలు..జాతీయ జీవనోపాధి కార్యక్రమానికి రూ.5,750కోట్లు కేటాయించామన్నారు

ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజనతో మరిన్ని గ్రామీణ రోడ్ల అనుసంధానం.2022 నాటికి అన్ని గ్రామాల్లో పక్కా రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఢిల్లీలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని..మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలకు రూ.10,000కోట్లు. జాతీయ వెదురు పరిశ్రమల కోసం రూ.1,290కోట్ల కేటాయిస్తున్నట్లు చెప్పారు.

ఈ ఏడాది 70 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషిచేస్తామన్నారు. రూ. 600 కోట్లతో క్షయరోగులకు పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ముద్ర యోజనకు రూ. 3లక్షల కోట్లు కేటాయించామన్నారు. వస్త్రపరిశ్రమకు రూ. 7 వేల కోట్లు,సేవ్ గంగా పథకం కోసం రూ.16,713 కోట్లు,గ్రామీణ రహదారాలు నెట్ వర్క్‌తో రూ.3.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఎస్సీలకు రూ. 56 వేల కోట్లు,ఎస్టీలకు రూ.36 వేల కోట్లు కేటాయించామన్నారు. 99 స్మార్ట్ సిటీలకు రూ. 2 లక్షల కోట్లు..సూక్ష్మ,చిన్న,మధ్య తరగతి పరిశ్రమలకు రూ.3674 కోట్లు కేటాయించామన్నారు.

- Advertisement -