ఎంఐఎంతో పొత్తు లేదు: బీఎస్పీ చీఫ్ మాయావతి

162
mayavathi
- Advertisement -

త్వరలో జరగనున్న యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని స్పష్టం చేశారు బీఎస్పీ చీఫ్ మాయావతి. ఎంఐఎంతో పొత్తు ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన ఆమె..అవన్నీ పుకార్లేనని ఎవరితో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన మాయావతి..తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీతో పొత్తు పెట్టుకుని 11 ఎంపీ స్థానాలను గెలిచారు. ఎన్నికల అనంతరం ఎస్పీతో తెగ తెంపులు చేసుకున్నారు మాయా.

యూపీతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పంజాబ్‌లో మాత్రం శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకుంది బీఎస్పీ. మొత్తం 117 సీట్లలో అకాలీదళ్‌ 97 స్థానాల్లో, బీఎస్పీ 20 స్థానాల్లో పోటీచేస్తున్నాయి.

- Advertisement -