కాజల్ ఆస్తుల విలువెంతో తెలుసా..?

144
kajal
- Advertisement -

ల‌క్ష్మీ క‌ళ్యాణ్ం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన బ్యూటీ కాజ‌ల్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు.ఇండస్ట్రీలోకి ఎంటరై 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాజల్‌…ప్రస్తుతం ఆచార్య, నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), ఇండియన్ 2, “హే సనామికా, హారర్ మూవీ ఘోస్టీ (తమిళ )చిత్రాల్లో నటిస్తున్నారు.

అయితే ప్రస్తుతం కాజల్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. 15 సంవత్సరాల సినీ కెరీర్‌లో కాజల్ బాగానే ఆస్తులు కూడబెట్టిందట. కాజ‌ల్ కార్లు మరియు స్థిర ఆస్తులు, వ్యాపారాలు అన్ని కలిసి దాదాపుగా వంద కోట్ల వరకు ఉన్నాయని సమాచారం. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే ఉద్దేశంతో వ‌ర‌సు సినిమాలు చేస్తున్న కాజ‌ల్ స్పెష‌ల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది. ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌తో క‌లిసి వ్యాపారం చేస్తోంది.

- Advertisement -