రూ.499కే ఫీచర్‌ ఫోన్‌..!

319
- Advertisement -

రూ.499కే ‘డీటెల్ డీ1’ పేరిట ఓ నూతన ఫీచర్ ఫోన్‌ను తాజాగా డీటెల్ సంస్థతో భాగస్వామ్యమైన బీఎస్‌ఎన్‌ఎల్ విడుదల చేసింది. ఈ ఫోన్‌తోపాటు రూ.153 టారిఫ్ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్నది.

ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రూ.103 టాక్‌టైం లభిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ టు బీఎస్‌ఎన్‌ఎల్ కాల్స్‌కు నిమిషానికి 15 పైసలు చార్జి చేస్తారు. అలాగే ఇతర ఆపరేటర్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసలు చార్జి పడుతుంది. ఇక ఈ ప్లాన్‌కు వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు. దీంతో సంవత్సరం పాటు ఈ ప్లాన్‌ను వాడుకోవచ్చు.

BSNL, Detel launch Detel D1 feature phone at Rs 499

డీటెల్ డీ1 ఫోన్‌లో 1.44 ఇంచ్ మోనోక్రోమ్ డిస్‌ప్లే, ఫిజికల్ కీప్యాడ్, సింగిల్ సిమ్ స్లాట్, 650 ఎంఏహెచ్ బ్యాటరీ, టార్చి లైట్, ఫోన్‌బుక్, ఎఫ్‌ఎం రేడియో, లౌడ్ స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ల కంటే ఫీచ‌ర్ ఫోన్లకి భార‌త్‌లో ఇప్ప‌టికీ డిమాండ్ ఉంద‌ని, అందుకే పెద్ద మొత్తంలో ఈ ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు డెటెల్ ఎస్ జీ ఎండీ యోగేశ్ భాటియా తెలిపారు.

- Advertisement -