క్రిస్మస్ వేడుకల్లో చెర్రీ-ఉపాసన దంపతులు..

18
ramcharan

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు రామ్‌ చరణ్‌ – ఉపాసన దంపతులు. 2021 క్రిస్మస్ కోసం ఉపాసన డోల్స్ అండ్ గబ్బానా నుండి సెల్ఫ్-టై బోతో చారల సిల్క్ మిడి దుస్తులను ఎంచుకుంది. దాని ధర రూ. 2.5 లక్షలు అని తెలుస్తోంది. ఉపాసన షేర్ చేసిన ఫోటోలలో ఫుల్ స్లీవ్ రెడ్ అండ్ వైట్ డ్రెస్‌లో వైట్ హీల్స్‌తో అందంగా కనిపిస్తోంది. మరోవైపు డెనిమ్ జీన్స్‌, కుర్తా షర్ట్‌లో రామ్ చరణ్ డాపర్‌గా కనిపిస్తున్నాడు.

క్రిస్మస్ పార్టీకి అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక కొణిదెల, ఇతర మెగా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా 2022 జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉంది.