సరిహద్దులో మళ్లీ డ్రోన్ల కలకలం.. బాంబు దాడికి కుట్ర..

67
- Advertisement -

జ‌మ్మూక‌శ్మీర్‌లో మరోసారి డ్రోన్ల క‌ల‌క‌లం రేపింది. డ్రోన్ల ద్వారా మన దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాల సప్లైని అడ్డుకున్నారు భారత భద్రతాబలగాలు. డ్రోన్ నుంచి జారవిడిచిన 3 మ్యాగ్నెటిక్ ఐఈడీ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అఖ్నూర్ సెక్టార్ లోని భారత్- పాక్ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ సంచరిస్తున్నట్లు గుర్తించి కాల్పులు జరిపారు భద్రతా సిబ్బంది. తర్వాత యాంటీ డ్రోన్ సిస్టమ్ ను రంగంలోకి దించారు.

కన్ చక్ లో మరోసారి డ్రోన్ కన్పించింది వెంటనే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో డ్రోన్ లో ఉన్న పేలోడ్ కిందపడగా.. డ్రోన్ మాత్రం తప్పించుకున్నట్లు తెలిపారు జమ్మూ అదనపు డీజీపీ ముకేశ్ సింగ్. డ్రోన్ నుంచి కిందపడిన పేలోడ్ లో టిఫిన్ బాక్సుల్లో ఉన్న మూడు మ్యాగ్నెటిక్ ఐఈడీలకు టైమర్ సెట్ చేసి ఉన్నట్లు తెలిపారు. ఐఈడీలను డిఫ్యూజ్ చేసినట్లు ముకేశ్ సింగ్ తెలిపారు.

అయితే అమర్ నాథ్ యాత్రే లక్ష్యంగా విధ్వంసం సృష్టించాలని పాక్ గత కొంతకాలంగా చేస్తున్న కుట్రలను పోలీసులు భగ్నం చేస్తున్నారు. గత నెలాఖర్లో కథువాలోని తాల్లీ హరియాచాక్ దగ్గర ఓ క్వాడ్ కాప్టర్ ను గుర్తించి కూల్చివేశారు జమ్ము పోలీసులు. అందులో 7 మ్యాగ్నెటిక్ బాంబులు, 7 యాజీబీఎల్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -