ఇది జవాన్లు అనుభవిస్తున్న క్షోభ..

194
BSF jawan raised serious
- Advertisement -

సైనికులు..దేశానికి ఓ రక్షణ కవచాలు. నిరంతరం దేశాన్ని కంటికి రెప్పాలా కాపాడుతుంటారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా పహారా కాస్తుంటారు. దేశానికి ఓ గర్వకారణంలా చెప్పుకునే సైనికులు మాత్రం అక్కడ ఆహార కోసం తిప్పలు పడుతున్నారు. జవాన్లను  ప్రభుత్వాలు, అధికారులు  ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో ఓ వీడియో దేశ ప్రజలను ఆలోచనలో పడేలా చేసింది.  జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు భద్రతా దళంలోని 29వ బెటాలియన్‌కి చెందిన తేజ్‌ బహదూర్‌ అనే సైనికుడు.. వారు పడుతున్న కష్టాలన్నింటినీ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

వీడియోలో.. దేశంలో అవినీతి పెరిగిపోతుండడంతో తమకి సరైన ఆహారం దొరకడంలేదని, సైనికుడిగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు కఠినంగా మారాయని చెప్తున్నారు. అయితే వీటన్నింటికీ ఫలానా వారు కారకులని బహదూర్‌ ఎవరినీ నిందించడం లేదు కానీ కారణం ఏదైనా జవాన్లకు కల్పించాల్సిన సౌకర్యాలు మాత్రం అందడంలేదని బాధపడుతున్నారు. సైన్యానికి వెచ్చించిన నిధులను పై అధికారులు తినేస్తున్నారని ఆరోపించారు. మాడిపోయి అట్టకట్టపోయిన రోటీ ముక్కలు, నీళ్ల టీతాగుతున్నామని పది గంటల పాటు డ్యూటీ చేసి రాత్రికి పసుపు, ఉప్పుకలిపిన సూప్‌ తాగుతూ జీవిస్తున్నామని దేశమంతటా ఎంతో గర్వంగా చెప్పుకునే జవానుఅనుభవిస్తున్న క్షోభ గురించి అందరికీ తెలియాలనే తామెదురుకుంటున్న పరిస్థితులను వీడియో తీసినట్టు తెలిపారు. తాము పడుతున్న కష్టాలను అధిష్ఠానం గుర్తించేవరకు ఈ అన్యాయాన్ని ఎప్పటికప్పుడు వీడియో రూపంలో తీసి పోస్ట్‌ చేస్తుంటానని బహదూర్‌ స్పష్టంచేశారు.

https://youtu.be/rIXTRtq6elo

- Advertisement -