17 మందితో కర్ణాటక కొత్త కేబినెట్ కొలువు దీరింది. ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగగా గవర్నర్ వాజుభాయ్ వాలా వారిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రివర్గంలో చేరిన ప్రముఖుల్లో మాజీ సీఎం జగదీష్ షెట్టార్,బీ.శ్రీరాములు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్.నగేష్ ఉన్నారు.
సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే లింగాయత్ వర్గానికి 5,ఒక్కళిగలకు 4,ఎస్సీ-ఎస్టీలకు చెరో మూడు మంత్రి పదవులు కేటాయించారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో కెఎస్.ఈశ్వరప్ప, ఆర్. అశోక, గోవింద్ మక్తప్ప కరజోల్, డాక్టర్ అశ్వథ్ నారాయణ్ సీఎన్, లక్ష్మణ్ సంగప్ప సవడి, ఎస్.సురేష్ కుమార్, వి.సోమన్న, సీటీ రవి, బసవరాజ్ బొమ్మై, కోట శ్రీనివాస్ పూజారి, జేసీ మధు స్వామి,చంద్రకాంత గౌడ, ప్రభు చౌహన్, జె శశిఖళా అన్నాసాహెబ్ ఉన్నారు.
జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జులై 26న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు యడియూరప్ప. 29న అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోగా మూడు వారాల తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టారు.