ఉప్పల్‌లో BRSV విద్యార్థి సదస్సు

10
- Advertisement -

రేపు జూలై 26న బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు జరగనుంది. ఉప్పల్‌లోని మల్లాపూర్ VNR గార్డెన్స్ లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జరగనుంది తెలంగాణ విద్యార్థి సదస్సు.

ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభోపన్యాసం ఉండనుండగా లంచ్ తరువాత కవి గాయకులు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రసంగం ఉండనుంది. ఆ తరువాత మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రసంగం…. తదనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్వి విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Also Read:రైతు బతుకు బరువు చేస్తావా?

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం అన్నారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, డా. గాదరి కిశోర్ కుమార్, BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -