కాంగ్రెస్‌పై వ్యతిరేకత..బీఆర్‌ఎస్‌దే గెలుపు!

7
- Advertisement -

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని కాంగ్రెస్ కార్యకర్తలే చెబుతున్న పరిస్థితి నెలకొంది. ప్రవీణ్ అనంతుల అనే కాంగ్రెస్ కార్యకర్త ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.తాను మూడు వారాలు తెలంగాణలో గడిపాను, నా పరిశీలన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంపై భారీ స్థాయిలో వ్యతిరేకత (అన్‌టై ఇన్‌కంబెన్సీ) ఉంది. GHMC ప్రాంతం బయట బీజేపీ పూర్తిగా కనిపించదు, అయితే BRS గణనీయమైన స్థాయిలో బలపడుతోందన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదనే భావన ప్రజల్లో ఎక్కువగా ఉంది. రైతులు ముఖ్యంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు—వారిలో చాలా మందికి ఇప్పటికీ రుణమాఫీ అందలేదని చెప్పారు. అదనంగా, రైతు బంధు సాయంలో ఆలస్యం జరుగుతోందని పలువురు ప్రస్తావించారు.

రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతల కంటే ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, ఆయనకు & KCRకి స్పష్టమైన తేడా ఉంది. చాలా మంది రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఒప్పోజిషన్ లీడర్‌లా మాట్లాడుతున్నాడని, కానీ పాలకుడిగా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. చాలా మంది KCR మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.

HYDRA (హైదరాబాద్ రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ) అమలు పెద్ద తప్పిదం అయ్యిందని ప్రజలు భావిస్తున్నారు. GHMC పరిధిలో రియల్ ఎస్టేట్ విలువలు తీవ్రంగా పడిపోవడం, జిల్లాలకు కూడా ప్రభావం చూపిస్తోంది. KCR హయాంలో తమ భూములు & ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండేవని చాలామంది తెలిపారు. నిర్మాణ రంగం పూర్తిగా ఆగిపోయి, వృత్తిపరమైన కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

- Advertisement -